AP Inter exams: ఇంప్రూవ్ మెంట్ కోసం మరో ఛాన్స్ ! పరీక్షలు ఎప్పుడంటే..

AP Inter exams: కరోనా పుణ్యమాని ఈ ఏడాది అన్ని ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రధానంగా విద్యా వ్యవస్థ చిన్నాభిన్న మయ్యింది. పరీక్షలైనా ఉన్నాయో లేదో తెలియదు.

Update: 2020-07-11 02:11 GMT
AP Inter exams:

AP Inter exams: కరోనా పుణ్యమాని ఈ ఏడాది అన్ని ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రధానంగా విద్యా వ్యవస్థ చిన్నాభిన్న మయ్యింది. పరీక్షలైనా ఉన్నాయో లేదో తెలియదు...తాము పాలయ్యామో లేదో తెలియదు... అంతా గందరగోళంగా మారింది. వాస్తవంగా పరీక్షలను రిజల్ట్స్ వచ్చిన వెంటనే పాస్ అయితే మార్కులు అనుకున్నట్టు వచ్చాయా? లేదా? చూసుకుని మరలా ఇంప్రూవ్ మెంట్ కోసం పరీక్షలు రాస్తారు. ఫెయిలయితే వాటిని పాస్ అయ్యేందుకు మరోసారి పరీక్షలు రాస్తారు. ఈ ఏడాది అవేమీ లేకుండా పరీక్షలను రద్దు చేసి, అందర్నీ పాస్ అని చెప్పారు. అయితే ఇంప్రూవ్ మెంట్ కోసం కోసం పరీక్షలు రాసే వారి కోసం సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో విద్యార్ధుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఇంటర్ బోర్డు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెయిన్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన విద్యార్ధులందరూ కంపార్ట్‌మెంటల్‌లో పాస్ అయినట్లు పేర్కొంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ వెల్లడించారు.

ఫెయిల్ అయిన విద్యార్ధులందరికీ కూడా ప్రతీ సబ్జెక్ట్‌లోనూ పాస్ మార్కులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఫస్టియర్ పరీక్షల్లో మార్కులు ఇంప్రూవ్‌మెంట్‌ కోరుకున్న విద్యార్ధులకు 2021 మార్చిలో మరో ఛాన్స్ ఇస్తామన్నారు. అప్పుడు సెకండియర్ విద్యార్ధులతో పాటు మళ్లీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామన్నారు

Tags:    

Similar News