AP High Court: కొవిడ్ హాస్పిటల్స్‌లో అధిక ఫీజుల వసూళ్లపై ఏపీ హైకోర్టు సీరియస్
AP High Court: అధిక ఫీజుల వసూళ్లపై చర్యలెందుకు తీసుకోలేదని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
AP High Court: రాష్ట్రంలో కొవిడ్ హాస్పిటల్స్‌లో అధిక ఫీజుల వసూళ్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అధిక ఫీజుల వసూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా చికిత్సకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎన్ని కేసులు నమోదవుతున్నాయని కోర్టు ప్రశ్నించింది. ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి? ఎన్ని రోజులకు రిజల్ట్ చెప్తున్నారని ప్రభుత్వాన్ని అడిగింది. అలాగే.. ఆస్పత్రుల్లో బాధితులకు సరిపడా బెడ్స్, ఆక్సిజన్, మందులు అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నించింది. ఈ నెల 27లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.