AP High Court: అప్పటి వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయొద్దు..
Nara Lokesh: ఏపీ హైకోర్టులో లోకేష్‌కు స్వల్ప ఊరట లభించింది.
Nara Lokesh: ఏపీ హైకోర్టులో లోకేష్‌కు స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో లోకేష్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ రెండు కేసుల్లో అక్టోబర్ 4 వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. లోకేష్‌కు మధ్యంతర బెయిల్ కావాలని న్యాయమూర్తిని లోకేష్ తరఫు న్యాయవాదులు కోరారు.
బుధవారం వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టుకు తెలిపారు. అయితే లోకేష్‌ను తాము అరెస్ట్ చేయాలనుకుంటే.. ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్లమని అన్నారు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడని, దీని ద్వారా చంద్రబాబు కుటుంబసభ్యులు లబ్ధి పొందారన్నారు. దీనికి సంబంధించిన అన్న ఆధారాలను కోర్టుకు సమర్పించామన్నారు ఏజీ శ్రీరామ్. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.