ఏపీ స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పింది. జనవరి, ఫిబ్రవరిలో కరోనా వ్యాక్సినేషన్ ఉంటుందన్న ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని శాఖల సేవలు అవసరమని నివేదించింది. మొదటి డోస్ వేసిన 4 వారాల్లో రెండో డోస్ వేయాల్సి ఉంటుందని, అందువల్ల ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని తేల్చిచెప్పింది. ప్రభుత్వ అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సమయం కోరారు. దాంతో, తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.