జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఏపీ హై కోర్ట్
AP High Court: న్యాయవ్యవస్థ ను ఉద్దేశించి జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హై కోర్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది...
AP High Court: న్యాయవ్యవస్థ ను ఉద్దేశించి జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ హై కోర్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జస్టిస్ చంద్రు ఆరోపణలు నిరాధారమైనవని.. ఎంతో మంది ప్రాధమిక హక్కులున కాపాడుతున్నామని జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ఏవో కొన్ని కారణాలతో మొత్తం హై కోర్టును ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. విశాఖలో ఓ డాక్టర్ ను పోలీసులు రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టారు.
హక్కుల గురించి పోరడాలంటే విశాఖకు వెళ్ళండి. మంచి డైరెక్టర్ తో సినిమా తీయించండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఇతర హైకోర్టులతో పోలిస్తే, జడ్జి నుంచి కక్షిదారుల వరకూ ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేవని.. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే నని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.