హైకోర్ట్‌లో ఏపీ సర్కార్‌కు షాక్.. స్కూళ్లు,కాలేజీల్లో...
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఫీజులపై గతంలో విద్యాశాఖ విడుదల చేసిన జీఓలను ఏపీ హైకోర్టు కొట్టేసింది. చట్టానికి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో ఇచ్చారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏపీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లు, జూ.కాలేజీలకు ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. కాలేజీలు, స్కూల్స్ నుంచి ప్రతిపాదనలు తీసుకొని ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరపున న్యాయవాది ముతుకుమల్లి శ్రీవిజయ్ వాదించారు.