Andhra Pradesh: ఏపీలో రెండు రోజులు వ్యాక్సిన్ నిలిపివేత

Andhra Pradesh: ఇకపై వాక్సిన్ పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది

Update: 2021-05-10 09:10 GMT

కరోనా వాక్సిన్ ఫైల్ ఫోటో 

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. మొద‌ట వ్యాక్సిన్ అంటేనే భ‌య‌ప‌డ్డ జ‌నం ఇప్పుడు వాటి కోసం భారీగా వ్యాక్సిన్ కేంద్రాల‌కు చేరుకుంటున్నారు. టీకాల కోసం ప్ర‌జ‌లు భారీగా బుకింగ్ చేసుకుంటున్నారు. ఏపీలోని ప‌లు జిల్లాలో రెండు రోజులు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలిచిపోయింది. మొదటి డోసు వేసిన వారికి రెండో డోసు కోసం ఎదురు చూపులు చూస్తున్న నేపధ్యంలో వ్యాక్సిన్ నిలిపివేయాలని ప్రభుత్వ నిర్ణయించింది.

ఇకపై వాక్సిన్ పక్కదారి పట్టకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. అయితే సెకండ్‌ డోస్ వేయించుకోవాల్సిన వారు ఆందోళ‌న చెందుతున్నారు. ఎల్లుండి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన తర్వాత రెండో డోస్ వేయించుకోవాల్సిన వారికి మాత్రమే వేస్తామని వైద్య సిబ్బంది అంటున్నారు. కృష్ణా జిల్లాలో గ‌న్న‌వ‌రంలో రెండో డోసు కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్ద ఎత్తున ప్రజలు వ‌చ్చారు. తాము 20 రోజులుగా వ్యాక్సినేషన్‌ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామ‌ని, త‌మ‌ను పట్టించుకోవడం లేదని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. విజయనగరం జిల్లాతో పాటు తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లోనూ టీకాలు వేయ‌ట్లేదు.

Tags:    

Similar News