AP Pensions: ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Pensions: ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు.
AP Pensions: ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు.
మేం అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే పెరిగిన పింఛను అమలుచేస్తామని... ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో రూ.7వేలు ఇస్తామని చెప్పాం. దీనిప్రకారం జూలైలో ఈ 3నెలల బకాయి 3వేలు, పెరిగిన పింఛను రూ.4వేలు కలిపి మొత్తం 7వేలు అందుతాయి. అలాగే దివ్యాంగుల పింఛను రూ.4వేల నుంచి 6 వేలకు పెంచుతున్నాం. వారికి బకాయిలతో కలిపి జూలైలో రూ.12 వేలు అందుతుంది అని చంద్రబాబు వివరించారు.