AP govt Fixed Vizag as Administrative Capital: విశాఖను పరిపాలనా రాజధాని చేసేందుకు ప్రభుత్వం ఫిక్స్ అయిందా?

Update: 2020-07-20 05:33 GMT

విజయదశమి నాటికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా విశాఖను మార్చాలని ప్రభుత్వం ఫిక్స్ అయిపోయిందా ! మాస్టర్ ప్లాన్ తో ముహూర్తం కూడా ఖరారు అయిందా ! అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. దీనికి కారణం ఇటీవల విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్. ఇప్పటికే విశాఖలో క్షేత్రస్థాయిలో పనులు పూర్తయిన నేపథ్యంలో ఇక శుభ ముహూర్తం చూసుకొని నూతన రాజధానిని ప్రారంభించే దిశగా వడివడిగా అడుగులేస్తున్నట్లే కనిపిస్తోంది జగన్ సర్కార్.

మూడు రాజధానుల ప్రతిపాదనలో విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని సీఎం జగన్ ప్రకటించినప్పటి నుండి విశాఖలో రాజధాని హంగామా ప్రారంభమైంది. అయితే తాజాగా వైసీపీలో నెంబర్ టూ నేత విజయసాయి రెడ్డి వైజాగ్ గురించి చేసిన ట్వీట్...క్యాపిటల్ హీట్ ను మరింత పెంచుతోంది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్దం అయినట్లు గ్రాఫిక్స్ కాకుండా త్వరలోనే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ వైజాగ్ ను చూడబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాలతో పాటు హాస్పిటాలిటీ, టూరిజం, ఇండస్ట్రీయల్, కార్గో, సీ ఫుడ్స్ ఇలా పలు రంగాల్లో విశాఖ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. మరోవైపు వాయు, జల, రోడ్డు మార్గాలతో అన్ని నగరాలకు కనెక్టివిటీ ఉండటంతో విశాఖ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా వెలుగొందుతోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వైజాగ్ లో తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఫోకస్ కూడా పెరుగుతోంది. దీంతో నగరంలో రాజధాని హంగు, ఆర్భాటాలు అప్పుడే కనిపిస్తున్నాయి. మరోవైపు కొద్ది రోజుల్లో విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తీ, కీరీటంలో విశాఖ మరో కలికితురాయిగా మారనుంది.

Tags:    

Similar News