నేడు ఏపీలో వాహనమిత్ర నిధుల విడుదల
CM Jagan: ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10వేలు అందిస్తోన్న ప్రభుత్వం
CM Jagan: నేడు ఏపీలో వాహనమిత్ర నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం. సొంత వాహనం కలిగి స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా పది వేల రూపాయల సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇవాళ 2 లక్షల 75 వేల 931 మంది లబ్ధిదారుల ఖాతాల్లో వాహన మిత్ర నిధులు జమకానున్నాయి. మొత్తం 275 కోట్ల 93 లక్షల రూపాయలు జమ చేయనుంది ప్రభుత్వం. విజయవాడలోని విద్యాధరపురంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులను జమ చేయనున్నారు సీఎం జగన్.