ఏపీలో హామీ ప్రకారం షాపులు తగ్గించని ప్రభుత్వం..

ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో గతంలో ఉన్న 4,380 షాపులను 33 శాతం తగ్గించడంతో ప్రస్తుతం..

Update: 2020-09-26 03:52 GMT

ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీ వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో గతంలో ఉన్న 4,380 షాపులను 33 శాతం తగ్గించడంతో ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న 2,934 మద్యం దుకాణాల లైసెన్సులు మరో ఏడాదిపాటు పొడిగించారు. మద్యం దుకాణాల తగ్గింపుపై కొత్త పాలసిలో ప్రభుత్వం ప్రస్తావించింది. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మద్య నియంత్రణ నేపథ్యంలో గత ఏడాది 20 శాతం మద్యందుకాణాలను తగ్గించిన ప్రభుత్వం ఈ ఏడాది మాత్రం కేవలం 13 శాతానికే పరిమితమైంది.

కరోనా లాక్డౌన్ తర్వాత.. ఓపెన్ చేసిన మద్యం షాపులకు సంబంధించి తీసుకున్న నిర్ణయంలో ఈ ఏడాది లిక్కరు షాపుల సంక్యను 13 శాతం తగ్గించారు. వాస్తవానికి ఏటా 20శాతం తగ్గించి..ఐదేళ్లలో పూర్తిగా మద్య నిషేధం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.. నూతన పాలసీ ప్రకారం హిందువుల ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి రైల్వే స్టేషన్-అలిపిరి మార్గంలో లిక్కర్ షాపులకు అనుమతి నిరాకరించారు. తిరుపతి బస్టాండ్ ,లీలామహాల్ సెంటర్ ,నంది సర్కిల్ ,విష్ణు నివాసం, శ్రీనివాసం వంటి ప్రాంతాల్లో లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించారు. మరోవైపు ఎక్సైజ్ శాఖ కమిషనర్ అనుమతితో లిక్కర్ మాల్స్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 2,934 షాపుల పరిధికి లోబడే ఈ లిక్కర్ మాల్స్ ను అందుబాటులోకి తేనుంది ప్రభుత్వం. ఏపీఎస్‌బీసీఎల్‌ ఆధ్వర్యంలో ఈ మద్యం షాపులు నడుస్తాయి. మద్యం షాపుల్లో ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానం ఖచ్చితంగా అమల్లో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Tags:    

Similar News