AP Vaccine News: ఏపీలో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్

AP Covid19 Vaccine News: ఆంధ్రప్రదేశ్ లోని ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్ వేసేందుకు సిద్దమైంది

Update: 2021-06-09 04:38 GMT

Vaccination In AP:(File Image)

AP Covid19 Vaccine News: వ్యాక్సినేషన్ కు ఆర్ధిక అడ్డంకులు ప్రధాని ప్రకటనతో తొలగిపోయాయి. అలాగే స్టాక్ సమస్య కూడా తీరబోతుంది. ఈ నెలాఖరుకల్లా కోట్ల డోసులు అన్ని కంపెనీలు సిద్ధం చేస్తుండటంతో... వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది. మరోవైపు ప్రజలు కూడా అవేర్ నెస్ పెరిగి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అనుకుంటున్నారు. దీంతో అందరికీ ఒకేసారి వ్యాక్సిన్ వేయడం కష్టమే. అందుకే ప్రాధాన్యతలవారీగా కొన్ని వర్గాలకు విడిగా వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ పిల్లలకు హాని చేస్తుందనే అంచనాలతో.. ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ ప్రాధాన్యతాక్రమంలో ప్రత్యేకంగా వేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సిన్ వేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 7వ తేదీన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందనే అంచనాల నేపధ్యంలో అప్రమత్తమైన జగన్ సర్కార్.. అర్హులైన తల్లులందరికీ వ్యాక్సిన్ వేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగానే గ్రామాల వారీగా జాబితాను సిద్దం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన తల్లులందరికీ ఒక్క రోజు ముందుగానే ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు టోకెన్లను పంపిణీ చేయాలని.. అంతేకాకుండా టోకెన్లలో ఉన్న తేదీ, సమయం ప్రకారం వారిని వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించి వ్యాక్సిన్ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 నుంచి 20 లక్షల మంది అర్హులైన తల్లులు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా వీరందరికీ వ్యాక్సిన్ వేయనున్నారు.

Tags:    

Similar News