AP Election Results 2024: ఏపీలో ఆలస్యంగా ఫలితాలు..ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ కు ఈ నెల 13న పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

Update: 2024-05-29 15:30 GMT

AP Election Results 2024: ఏపీలో ఆలస్యంగా ఫలితాలు..ఎందుకంటే?

AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ లో కౌంటింగ్ కోసం ఈసీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4న ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో కౌంటింగ్ కు ఎక్కువ సమయం పట్టనుంది. దీంతో ఆలస్యంగా ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ కు ఈ నెల 13న పోలింగ్ జరిగింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అభ్యర్థులు, పార్టీల గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్నారు. మరో వైపు కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.

తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు అధికారులు. ఇందుకోసం 14 నుంచి గరిష్టంగా 50 టేబుల్స్ వరకూ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు కూడా ఈసారి 5 లక్షలకు పైగా నమోదవడంతో.. వీటి లెక్కింపుకే ఈసారి ఎక్కువ సమయం పట్టనుంది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అధికంగా నమోదవడంతో ఈవీఎంల కౌంటింగ్ ఆలస్యంగానే ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ఈవీఎంల లెక్కింపు ప్రారంభమయ్యాక కౌంటింగ్ స్పీడందుకోనుంది. పోలింగ్ బూత్‌ల సంఖ్యను బట్టి రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోటీ చేసిన అభ్యర్థులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. తక్కువ మంది పోటీ చేసిన చోట, లెక్కింపు కేంద్ర స్థలం చిన్నగా ఉన్నచోట 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. గరిష్టంగా 14 టేబుళ్ల వరకూ ఏర్పాటు చేశారు.

తిరుపతి జిల్లా నగిరిలో ఏడుగురు, కృష్ణా జిల్లా పామర్రులో అతి తక్కువగా 8 మంది మాత్రమే అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడ కౌంటింగ్ త్వరగా పూర్తి కానుంది. ఈ నియోజకవర్గాల్లో 4 గంటల్లోనే అంటే మధ్యాహం 12 గంటలకే ఇక్కడ ఫలితం వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. నందిగామలో 11 మంది బరిలో ఉన్నారు. నందిగామ తర్వాత పామర్రు ఫలితం రానుంది. అత్యధిక పోలింగ్ జరిగిన చోట్ల, అభ్యర్థులు ఎక్కువగా బరిలో ఉన్నచోట్ల ఫలితం ఆలస్యం కానుంది.

పోలింగ్ రోజు మాచర్ల, చంద్రగిరి, కమలాపురం, తాడిపత్రి లాంటి కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలింగ్ అనంతరం కూడా ఈ టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది. దీంతో కౌంటింగ్ డే కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది పోలీస్ శాఖ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం పోలీస్ శాఖను ఆదేశించింది.

పోలింగ్ రోజు ఉద్రిక్తతల నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. శాంతిభద్రతలను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. అదనపు బలగాలను కూడా ఏపీకి రప్పించింది. కౌంటింగ్ అనంతరం కూడా రెండు వారాలపాటు ఈ బలగాలు రాష్ట్రంలోనే శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నాయి. 

Tags:    

Similar News