Pawan Kalyan: 'ముందు బాధ్యత, ఆ తర్వాతే వినోదం'.. పవన్ కీలక వ్యాఖ్యలు
'పల్లె పండుగ' కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ సినిమాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పల్లె పండుగ' కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ సినిమాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో పవన్ మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న అభిమానులు.. 'ఓజీ' అంటు నినాదాలు చేశారు.
దీంతో స్పందించిన పవన్.. 'ముందు బాధ్యత.. ఆ తర్వాత వినోదం. సినిమాల్లో ఎవరితోనూ పోటీ పడను. ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు నిష్ణాతులు. అందరూ బాగుండాలని కోరుకునేవాడిని నేను. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, నాని.. ఇలా అందరూ బాగుండాలి' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా సీఎం చంద్రబాబుపై కూడా పవన్ ప్రశంసలు కురిపించారు. పాలన ఎలా చేయాలన్న అంశంలో తనకు సీఎం చంద్రబాబు స్ఫూర్తి అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో తెలియదని పవన్ ఎద్దేవా చేశారు. ఏరోజూ.. వాళ్లు గ్రామసభలు, తీర్మానాలు చేయలేదన్నా పవన్.. ప్రస్తుతం రాష్ట్రానికి చంద్రబాబు అపార అనుభవమే బలమని తెలిపారు. పల్లెల అభివృద్ధి కోసం రూ. 4500 కోట్ల విడుదల చేస్తున్నామన్న పవన్ కళ్యాణ్.. ఇది లంచాల ప్రభుత్వం కాదని, నిలబడే ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.