రాష్ట్రంలో డిగ్రీ విద్య అత్యుత్తమంగా ఉండేలా చర్యలు.. టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలు వెంటనే భర్తీ...

YS Jagan: టీచింగ్ స్టాఫ్ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావుండకూడదు - జగన్

Update: 2022-04-30 02:42 GMT

రాష్ర్టంలో డిగ్రీ విద్య అత్యుత్తమంగా ఉండేలా చర్యలు.. టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలు వెంటనే భర్తీ...

YS Jagan: రాష్ట్రంలో డిగ్రీ విద్య అత్యుత్తమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. డిగ్రీ విద్యను ప్రత్యేక యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. పట్ట భద్రుల కోర్సుల్లో భాగంగా తప్పని సరిగా పది నెలలు ఇంటర్న్ షిప్ ఉండేలా చర్యుల తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ ఉండాలన్నారు. అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీ స్థాయికి తీసుకు వెళ్లాలన్నారు. టీచింగ్ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యాసంస్థల్లో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో.. జీఈఆర్ గణనీయంగా పెరగాలని సీఎం ఆదేశించారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమలు వల్ల గతంలో కన్నా గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియ పెరిగిందన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు వీలుగా ఇంగ్లీష్ పై పట్టు, ప్రావిణ్యం, విద్యార్ధులకు రావాలని వీటిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. GRE, G మ్యాట్ పరీక్షలపైన విద్యార్ధులకు మంచి శిక్షణ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 4 నుంచి5 యూనివర్శిటీలను ఎంపిక చేసుకుని, దేశంలో ఉత్తమ యూనివర్శిటీల స్థాయికి తీసుకెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు.

దీన్ని ఒక లక్ష్యంగా తీసుకుని ముందడుగులు వేయాలన్నారు. పట్టభద్రులకు కోర్సుల్లో భాగంగా తప్పనిసరిగా 10 నెలల ఇంటర్న్‌షిప్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.మూడు విడతల్లో ఇంటర్న్‌షిప్ ఉండాలని,మొదటి ఏడాది 2 నెలలు,రెండో ఏడాది 2నెలలు,మూడో ఏడాది 6 నెలల ఇంటర్న్‌షిప్ ఉండాలన్నారు.రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న దాదాపు 30 నైపుణ్యకాలేజీల్లోనూ ఇంటర్న్‌షిప్‌ కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక డిగ్రీ కాలేజీ ఉండాలన్నారు.

నియోజకవర్గంలో ఉన్న జూనియర్‌ కాలేజీని డిగ్రీ కాలేజీ స్థాయికి తీసుకెళ్లాలని,దీనికోసం నాడు –నేడు కింద ఈ పనులు చేపట్టాలన్నారు. డిగ్రీ కాలేజీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక వ్యవస్థను తీసుకురావాలన్నారు. విదేశాల తరహాలో రాష్ట్రంలో డిగ్రీకోర్సులను సమర్థవంతంగా తీసుకురావాలన్నారు. ఇప్పుడున్న డిగ్రీకాలేజీలను ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. డిగ్రీ విద్య ను ప్రత్యేక యూనివర్సిటీ పరిధిలోకి తీసుకు రావాలని నిర్దేశించారు.

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీకాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్శిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలన్నారు. ఇందులో మంచి పరిజ్ఞానం ఉన్నవారిని ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలన్నారు. డిగ్రీ కోర్సులకు విలువను జోడించాలని, దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలని అనుకునేట్టుగా ఉండాలన్నారు.ఏపీలో డిగ్రీలు చదివితే.. మంచి జీతాలు వచ్చే పరిస్థితిని తీసుకురావాలన్నారు.

కళాశాలల్లో బోధన సిబ్బంది భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీచింగ్‌ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టీచింగ్‌ స్టాఫ్‌ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదన్నారు. ఇక్కడ రాజీపడితే విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. సమర్ధు్లైన వారిని, ప్రతిభ ఉన్నవారిని టీచింగ్‌ స్టాఫ్‌గా తీసుకోవాలన్నారు. వారికీ పరీక్షలు నిర్వహించి... ఎంపిక చేయాలన్నారు. టీచింగ్‌ స్టాఫ్‌ కమ్యూనికేషన్ల నైపుణ్యాన్నికూడా పరిశీలించాలన్నారు. యూనివర్శిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యమైనవన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News