వాలంటీర్లకు సీఎం గుడ్ న్యూస్.. ప్రతి ఏటా సేవా పురస్కారాలు
Andhra Pradesh: వాలంటీర్లకు సీఎం గుడ్ న్యూస్
Andhra Pradesh: ఉగాది పండుగ పురస్కరించుకుని వాలంటీర్లకు ఏపీ సర్కార్ అవార్డులు ప్రదానం చేసింది. కృష్ణా జిల్లా పోరంకిలో ఈ కార్యక్రమం జరిగింది. సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర అవార్డులతో వాలంటీర్లను సీఎం జగన్ సత్కరించారు. వాలంటీర్లకు సీఎం జగన్ అవార్డులు ప్రదానం చేశారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా వాలంటీర్లు పని చేస్తున్నారన్నారు సీఎం జగన్. పరిపాలన అంతా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే జరుగుతోందన్న ఆయన... పరిపాలన ఇలా కూడా చేయవచ్చా అని వాలంటీర్లు నిరూపించారన్నారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు వాలంటీర్లందరికీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు.
ప్రజలకు, ప్రభుత్వానికి సంధానకర్తలుగా వాలంటీర్లు పని చేస్తున్నారన్నారు సీఎం జగన్. సేవామిత్ర అవార్డుకు 10 రూపాయల నగదు బహుమతి.. సేవారత్న అవార్డుకు 20వేల నగదు, సేవావజ్ర అవార్డుకు 30వేల నగదు బహుమతి అందించనున్నారు. సేవావజ్ర అవార్డుకు 875 మంది వాలంటీర్ల ఎంపికకాగా..4వేల మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రతి ఏడాది ఈ పురస్కారాలను అందిస్తామన్న జగన్.. అవార్డుల ప్రదానోత్సవానికి ప్రభుత్వం 240 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు.