రేపే 'వైఎస్సా‌ఆర్‌ జలకళ' ప్రారంభం, అర్హతలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ లో పేద రైతులకు అండగా మరో పథకం అడుగు ముందుకు పడబోతోంది. సాగునీటి కోసం వేల అడుగుల లోతుతో బోరుబావులను తవ్వించుకునేందుకు..

Update: 2020-09-27 03:28 GMT

ఆంధ్రప్రదేశ్ లో పేద రైతులకు అండగా మరో పథకం అడుగు ముందుకు పడబోతోంది. సాగునీటి కోసం వేల అడుగుల లోతుతో బోరుబావులను తవ్వించుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం, అందుకోసం అప్పులపాలవుతున్న విషయాన్నీ గుర్తించిన వైఎస్‌ జగన్ రైతులు పడుతున్న అవస్థలను అర్ధం చేసుకొని.. ఇచ్చిన హామీయే 'వైఎస్సా‌ఆర్‌ జలకళ'.. ప్రస్తుతం ఈ హామీ కార్యరూపం దాలుస్తోంది. రేపు (సోమవారం) 'వైఎస్సా‌ఆర్‌ జలకళ' పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. దాదాపు ౩ లక్షల మంది రైతులకు మేలు చేస్తుంది.. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.2,340 కోట రూపాయలను బడ్జెట్ లో కేటాయించింది. ఈ పథకం కింద 5 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందనుంది. ర్మాష్టంలోని కమాండ్‌, నాన్‌ కమాండ్‌ ఏరియాల్లో ఎక్కడైతే భూగర్చ జలాలు వినియోగానికి అనువుగా వుంటాయో ఆ ప్రాంతాల్లో 'వైఎస్సాఆర్‌ జలకళ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.

అయితే ఈ పథకానికి రైతుకు కనిష్టంగా 2.5 ఎకరాలు, గరిష్టంగా 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలో ఉన్న గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలిస్తారు. అనంతరం డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియోలజిస్ట్‌కు పంపుతారు. సాంకేతికంగా దానిని జియోలజీ విభాగం పరిశీలించిన అనంతరం.. అప్రూవ్ చెయ్యగానే కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్‌ లో బోరుబావులను తవ్వుతారు. బోరుబావిలో నీళ్లు పడే‌ శాతంను బట్టి కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులు ఉంటాయి.   

Tags:    

Similar News