Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన
Jagan Delhi Tour: సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది.
Jagan Delhi Tour: సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయల్దేరి తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్. ఇక ఢిల్లీలో రెండ్రోజుల పాటు పర్యటించిన సీఎం జగన్ కేంద్రమంత్రులు అమిత్‌షా, ప్రకాష్ జవదేకర్, గజేంద్రసింగ్ షెకావత్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పలు అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. అలాగే రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్‌పై వివరణ ఇచ్చారు సీఎం జగన్.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు సీఎం జగన్. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఆయన చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలించాలని కోరారు. అలాగే కాకినాడలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని చెప్పగా విధి విధానాలు ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు ప్రధాన్.
ఇక పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్రమంత్రి షెకావత్‌తో గంటకు పైగా చర్చించారు సీఎం జగన్. 2022 జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుందన్న సీఎం భూ సేకరణ, పునరావాస పనులను వేగవంతం చేసినట్టు తెలిపారు. ప్రాజెక్ట్ బకాయిల అంశాన్ని కేంద్ర మంత్రి దగ్గర ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు.