AP CM Jagan Aerial Survey: సీఎం ఏరియల్ సర్వే.. బాధిత కుటుంబానికి రూ. 2వేల తక్షణ సాయం

AP CM Jagan Aerial Survey: గోదావరి వరద తాకిడికి గురైన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఏరియల్ సర్వే చేశారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో ఆయన ఈ సర్వే నిర్వహించారు.

Update: 2020-08-18 16:49 GMT

AP CM Jagan Aerial Survey: గోదావరి వరద తాకిడికి గురైన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఏరియల్ సర్వే చేశారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో ఆయన ఈ సర్వే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గోదావరి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు. అంతకుముందు గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

 వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ''అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్‌ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరంలేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నానని' ఆయన అన్నారు.

రూ. 2వేల సాయం

ఉభయ గోదావరి జిల్లాల వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సహాయక చర్యలలో పాల్గొంటూనే బాధితులను గుర్తించాలని గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. అంతకుక్రితం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. దీంతో పాటు నష్టపోయిన పంటలకు సంబంధించి వ్యవసాయశాఖ అదికారులు అంచనా వేసిన తరువాత చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.  

Tags:    

Similar News