CM Jagan Letter: ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ
CM Jagan Letter: ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.
CM Jagan Letter: ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. పీఎంఏవై కింద గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం జగన్ కోరారు. దీనికోసం ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది. 17,005 గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించాం.
ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి అని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. మౌలిక వసతులకు నిధులిచ్చేలా సంబంధిత శాఖను ఆదేశించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.