ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించిన సీఎం.. ఆ ఎమ్మెల్యేలను బ్లాక్‌లిస్టులో చేర్చుతామని వార్నింగ్

Gadapa Gadapaki Mana Prabhutvam: పనిచేయకపోతే ఒప్పుకోను. ప్రజల మధ్య ఉండకపోతే ఊరుకోను.

Update: 2022-06-11 07:00 GMT

ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించిన సీఎం.. ఆ ఎమ్మెల్యేలను బ్లాక్‌లిస్టులో చేర్చుతామని వార్నింగ్

Gadapa Gadapaki Mana Prabhutvam: పనిచేయకపోతే ఒప్పుకోను. ప్రజల మధ్య ఉండకపోతే ఊరుకోను. ప్రజా సమస్యలను తెలుసుకోకపోతే తప్పిస్తాననే మాటలతో ఎమ్మెల్యేలకు చుక్కలు చూపిస్తున్నారు సీఎం జగన్‌. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తలపెట్టి నెలరోజులు పూర్తయిన సందర్భంగా అమరావతిలో వర్క్‌షాప్‌ నిర్వహించారు వైసీపీ బాస్‌. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు చుక్కలు కనబడ్డాయి. ఐ ప్యాక్‌ టీం.. ఒక్కొక్క నేత పల్స్‌ను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించింది. దీంతో పాటు కెరియర్‌ గ్రాఫ్‌, పెర్ఫామెన్స్‌ గ్రాఫ్‌ సరిగా లేని వారు ఇక ఇళ్లకే పరిమతమని, ఆరునెలల కాలంలో ఇంప్రూవ్‌ చేసుకోవాలని సూచించారు సీఎం జగన్. ఇక జీరో రిజ‌ల్ట్ ఉన్న ఎమ్మెల్యేల‌ను బ్లాక్ లిస్టులో ఉంచుతామని చెప్పగా ఇప్పటికే ఆ లిస్టులో ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లు చేరినట్టు సమాచారం.

కొందరు ఎమ్మెల్యేలు తెలివిగా వాలంటీర్ల సాయంతో కార్యక్రమాన్ని చక్కబెడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు సీఎం జగన్. ఇకపై అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యలు తెలిపినా, నిరసనలు వ్యక్తం చేసినా అవన్నీ భరించాల్సిందేనని అన్నారు. ఇంట్లో ఉంటే నో ఛాన్స్.. ఇంటింటికీ తిరిగితేనే ఛాన్స్‌ అని కుండబద్దలు కొట్టినట్టు నేతలకు సీఎం జగన్‌ చెప్పినట్టు తెలుస్తోంది. పనితీరు బాగుంటే కొత్తవారికి కూడా అవకాశాలు వస్తాయని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇది ప్రాథమిక దశేనని, గడప గడపకు రెండో విడత తరువాత బ్లాక్‌లిస్టులో మరికొన్ని పేర్లు వచ్చి చేరుతాయని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో బ్లాక్‌లిస్టులో ఎవరి పేరు, ఎప్పుడు చేరుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఎమ్మెల్యేలు.

ఇక.. ఈ వర్క్‌షాప్‌ కార్యక్రమంలో పలువురు మంత్రులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో తిరిగేందుకు మొహ‌మాటం పడాల్సిన అవసరం లేదని, వాలంటీర్ల సాయంతో తిర‌గాల్సిన పని కూడా లేదని అన్నారు. సమస్యలు తెలిస్తేనే గడప గడపకు కార్యక్రమం సక్సెస్‌ అయిందని భావించాల్సి ఉంటుందని చెప్పారు. శత్రువు ఇళ్లయినా సరే.. వెళ్లి పథకాలు అందుతున్నాయో, లేదో తెలుసుకుంటానని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News