Jagan: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్..?

Jagan: జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత కేబినేట్ భేటీ

Update: 2023-09-12 07:48 GMT

Jagan: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్..?

Jagan: ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. జగన్ హస్తిన పర్యటన తర్వాత కేబినేట్ భేటీ ఉంటుందని జోరుగా చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్‌తో పాటు..వచ్చే వారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో జగన్ హస్తిన టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు.. ఇతర అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..

సీఎం జగన్‌తో పార్టీ ముఖ్య నేతలు, అధికారులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో సజ్జల రామకృష్ణరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటలిజెన్స్ చీఫ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్, తర్వాత పరిణామాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులు, శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

అంతకు ముందు సీఎం జగన్‌‌ను.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కలిశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో.. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు పొన్నవోలు. లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి వచ్చిన జగన్ కు..చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ లో సీఐడీ వేసిన పిటిషన్లు ఇతర అంశాలను వివరించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News