అందుకే తెలంగాణ రాజకీయాల్లో మేము వేలు పెట్టలేదు- సీఎం జగన్‌

AP, TS Water Disputes: తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తోన్న జల వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మొదటిసారి స్పందించారు.

Update: 2021-07-08 10:29 GMT

అందుకే తెలంగాణ రాజకీయాల్లో మేము వేలు పెట్టలేదు- సీఎం జగన్‌

AP, TS Water Disputes: తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తోన్న జల వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మొదటిసారి స్పందించారు. తెలంగాణ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఘాటుగా రియాక్టయ్యారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు, కోస్తాంధ్రకు ఎన్ని నీళ్లో, తెలంగాణకు ఎన్ని నీళ్లో అందరికీ తెలుసన్నారు. మొదట్నుంచీ వస్తున్న లెక్కల ప్రకారమే నీళ్ల కేటాయింపులు జరిగాయని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన సమయంలోనూ ఇరు ప్రాంతాల నేతలు సంతకాలు కూడా చేశారని గుర్తుచేశారు.

శ్రీశైలంలో 881 అడుగులపైన నీళ్లు ఉంటేనే రాయలసీమకు నీళ్లొస్తాయన్న జగన్మోహన్‌‌రెడ్డి తెలంగాణ మాత్రం 800 అడుగుల్లోపే నీటిని వాడుకుంటోందన్నారు. మీరేమో 800 అడుగుల దగ్గర నీళ్లు వాడుకుంటారు? మేము వాడుకోవద్దా? అంటూ తెలంగాణ నేతలను ప్రశ్నించారు. ఏదిఏమైనా చట్టబద్ధంగా మాకొచ్చే నీటిని వాడుకుని తీరుతామన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తేల్చిచెబుతున్నామన్నారు.

800 అడుగుల దగ్గర పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లి తీరుతామని సీఎం జగన్ తేల్చిచెప్పారు. ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా? అంటూ ఘాటు వ్యా‌ఖ్యలు చేశారు. తెలంగాణతో తాము విభేదాలను కోరుకోవడం లేదని, అందుకే తెలంగాణ రాజకీయాల్లో తాను వేలు పెట్టలేదని గుర్తుచేశారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలనేదే తమ ఉద్దేశమని జగన్ అన్నారు. 

Tags:    

Similar News