Andhra Pradesh: నెలలో కోటిమందికి వ్యాక్సిన్‌: జగన్‌

Andhra Pradesh: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు కరోనా వ్యాక్సినేషన్ అడ్డంకిగా ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి.

Update: 2021-03-24 13:08 GMT

Andhra Pradesh: నెలలో కోటిమందికి వ్యాక్సిన్‌: జగన్‌

Andhra Pradesh: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియకు కరోనా వ్యాక్సినేషన్ అడ్డంకిగా ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. మరో వారం రోజులు మాత్రమే ఎన్నికల ప్రక్రియకు సమయం ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై అధికార యంత్రాంగంలో సందిగ్ద వాతావరణం నెలకొన్నది. ఎన్నికలు పూర్తియి ఉంటే వ్యాక్సినేషన్ పై పూర్తి దృష్టి పెట్టే వాళ్లమని. ఇప్పుడు ఆ విధంగా జరగకపోవడంతో ప్రజారోగ్యానికి భంగం కలిగించే పరిస్థితులకు బాధ్యులు ఎవరని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞంగా ముమ్మరంగా కొనసాగించాలని సూచించారు.

నాలుగు ఐదు వారాల్లో అర్బన్ ప్రాంతాల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రూరల్ ఏరియాలో పైలెట్ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు రెండు గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్ చేపట్టాలని సూచించారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్ లు, వాలంటీర్లు, ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లు అందరూ వాక్సినేషన్ ప్రక్రియల్లో భాగస్వాములు కావాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజల్లో చైతన్యం కల్గించే విధంగా ప్రచారం నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు.

Tags:    

Similar News