CM Jagan: ఏపీలో టీకా డోసులకోసం మరోసారి కేంద్రానికి జగన్ లేఖ

CM Jagan: కోవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్‌, తదితర అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక సమీక్ష నిర్వహించారు.

Update: 2021-07-28 15:00 GMT

CM Jagan: ఏపీలో టీకా డోసులకోసం మరోసారి కేంద్రానికి జగన్ లేఖ

CM Jagan: కోవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్‌, తదితర అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌పై అధికారులు పలు వివరాలు సీఎంకు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ అనుకున్నంత వేగంగా జరగట్లేదని ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌పై మరోసారి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు.

రాష్ట్రంలోని అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై సమీక్ష జరిపిన సీఎం ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్లు, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్వహణపై ఫోకస్ పెట్టాలన్నారు. ఇందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్ సీల్లో ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్లు ఉంచాలని సూచించారు.

జిల్లాల వారీగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల నిర్వహణకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏపీఎంఎస్ ఐడీసీలో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లు, ఎలక్ట్రికల్, వైద్య పరికరాల అనుబంధ విభాగాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుపై కూడా సమీక్ష జరిపిన సీఎం ముందుగా వంద బెడ్లు ఉన్న ఆస్పత్రుల్లో ప్రాధాన్యతగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేయించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ప్రైవేట్ హాస్పిటళ్లకు 30శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు.

ఇక కొత్త మెడికల్ కాలేజీలకోసం పెండింగ్ లో ఉన్న భూ సేకరణను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. వ్యాక్సినేషన్ లో టీచర్లకు ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు ఇవ్వాలన్నారు. అయితే మే నుంచి జులై వరకు ప్రైవేటు ఆస్పత్రులకు 43 లక్షల 38 వేల కోవిడ్ టీకా డోసులు ఇస్తే కేవలం 5 లక్షల 24 వేల డోసులు మాత్రమే వాడారని సీఎంకు తెలిపారు అధికారులు. ప్రైవేట్‌కు బదులు ప్రభుత్వానికి వ్యాక్సిన్లు ఇస్తే వ్యాక్సినేషన్ మరింత వేగంగా ముందుకు సాగుతుందన్నారు. దీంతో మరోసారి కేంద్రానికి లేఖ రాస్తానని సీఎం జగన్ తెలిపారు. 

Tags:    

Similar News