CM Jagan: ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్.. సాయంత్రం 6:30లకు నిర్మలా సీతారామన్‌తో భేటీ
CM Jagan: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్‌పై ఆసక్తి
CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 6:30లకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై ఆమెతో చర్చించనున్నారు. రేపు వామపక్ష తీవ్రవాదం నిర్మూలన సదస్సులో ఏపీ సీఎం పాల్గొననున్నారు. అలాగే రేపు రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్‌పై ఆసక్తి నెలకొంది.