ఇది అభివృద్ధి కాదా? అని ప్రశ్నిస్తున్నా- సీఎం జగన్
Rythu Dinotsavam: వైఎస్సార్ బతికున్నంతకాలం రైతుల గురించే ఆలోచించారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు సీఎం జగన్.
Rythu Dinotsavam: వైఎస్సార్ బతికున్నంతకాలం రైతుల గురించే ఆలోచించారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు సీఎం జగన్. అనంతపురం జిల్లా రాయదుర్గంలో రైతు దినోత్సవ సభలో పాల్గొన్న ఆయన రైతు భరోసా కేంద్రంలో మొక్కలు నాటారు. జలయజ్ఞంతో వైఎస్సార్ రాష్ట్రం రూపురేఖలు మార్చారని, రైతు విప్లవానికి నాంది పలికారని గుర్తుచేశారు సీఎం జగన్.
పాదయాత్రలో రైతుల కష్టాలను చూశానన్న సీఎం జగన్ రెండేళ్లలో రైతుల కోసం 8వేల 670 కోట్లు ఖర్చు చేశామన్నారు. పెట్టుబడి సాయంగా రైతులకు 13వేల 500 అందిస్తున్నామని చెప్పారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు అండగా నిలిచామని, రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు తోడుగా నిల్చున్నామన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా వైసీపీయేనని చెప్పారు సీఎం జగన్.
తానంటే గిట్టనివారు కొందరు రాష్ట్రంలో అసలు అభివృద్దే జరగడం లేదని అంటున్నారని, గ్రామాలకు వచ్చి చూస్తే అభివృద్ధి ఏంటో తెలుస్తుందని సమాధానమిచ్చారు సీఎం జగన్. గత ప్రభుత్వాల హయాంలో స్కూళ్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇప్పుడు నాడు-నేడు ద్వారా వాటి రూపురేఖలే మార్చేశామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టామన్నారు. ఓటు వేసినవారికి, వేయనివారికి కూడా పథకాలు అందుతున్నాయని చెప్పారు సీఎం జగన్. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా గ్రామంలోని కనీసం 20మందికి ఉద్యోగాలు కల్పించామని, ఇది కాదా అభివృద్ధి అని ప్రశ్నించారు సీఎం జగన్.