రాజ్యసభకు పంపించే జాబితా సిద్ధం చేసిన సీఎం జగన్
Rajyasabha: రాజ్యసభకు పంపించే ఆ నలుగురి విషయంలో సీఎం వైఎస్ జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టుగా కన్పిస్తోంది.
Rajyasabha: రాజ్యసభకు పంపించే ఆ నలుగురి విషయంలో సీఎం వైఎస్ జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్టుగా కన్పిస్తోంది. రాజ్యసభకు పంపించే జాబితాను జగన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. టీజీ వెంకటేష్, సీఎం రమేష్, విజయసాయి, సుజానా చౌదరిల పదవీ కాలం పూర్తి కావడంతో ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్నదానిపై జగన్ డిసైడైనట్టుగా ఉన్నారు. గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు రిటైర్ కావడంతో ఈసారి నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయ్.
రెండోసారి విజయసాయిరెడ్డికి ఛాన్స్ దాదాపు ఖాయం. కిల్లి కృపారాణితో పాటు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ లేదంటే ఆయన భార్య ప్రీతి అదానీ? బీసీ కోటాలో బీద మస్తాన్ రావుకు రాజ్యసభ సీటు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్. ఇవాళ, రేపట్లోగా బెర్త్ ఖరారుపై ప్రకటన రానుంది. మరోవైపు రాజ్యసభను చలమలశెట్టి సునీల్, ఆర్ కృష్ణయ్య కూడా ఆశిస్తున్నారు. అదే సమయంలో ఇన్నాళ్లూ పనిచేసినవారికి పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా అన్న ఆవేదనలో పలువురు సీనియర్లున్నారు.