CM Jagan: చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ విమర్శలు
CM Jagan: నన్ను ఒక్కడిని ఎదుర్కునేందుకు కూటమి పేరుతో గుంపులుగా వస్తున్నారు
CM Jagan: ఎన్నికల్లో చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని ఫైర్ అయ్యారు ఏపీ సీఎం జగన్. తాడిపత్రిలో ఎన్నికల ప్రచార భేరిలో పాల్గొన్న ఆయన టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించారు. తానొక్కడిని ఎదుర్కొనేందుకు కూటమి పేరుతో గుంపులుగా కలిసి వస్తున్నారన్నారు. కూటమి పేరుతో కలిసి వచ్చేవారికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు సీఎం జగన్. చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలకు ముగింపు పడినట్లేనన్నారు.