ఏపీలో వాణిజ్య ఉత్సవ్ 2021 ప్రారంభించిన జగన్
* రెండేళ్లలో 10 మెగా ప్రాజెక్టులను ఏర్పాటు చేశామన్న సీఎం * రాష్ట్ర ఎగుమతుల రోడ్ మ్యాప్ విడుదల చేసిన జగన్
AP Vanijya Utsav 2021: ఎగుమతుల విషయంలో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలపడమే లక్ష్యంగా విజయవాడలో ఏర్పాటు చేసిన వాణిజ్య ఉత్సవ్ 2021ను సీఎం జగన్ ప్రారంభించారు. రెండేళ్లలో 10 మెగా ప్రాజెక్టులను ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు.. రాష్ట్ర ఎగుమతుల రోడ్ మ్యాప్‌ను సీఎం విడుదల చేశారు. ఎక్స్పోర్ట్కు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ఈ-పోర్టల్‌ను ప్రారంభించారు. గతరెండేళ్లలో ఏపీ ఎగుమతులు 19.43 శాతం వృద్ధి చెందాయని సీఎం తెలిపారు.