Mukesh Kumar Meena: ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా కీలక నిర్ణయం
Mukesh Kumar Meena: రాష్ట్రంలో అక్రమ మద్యం అరికట్టేందుకు ఈసీ కీలక నిర్ణయం
Mukesh Kumar Meena: ఏపీలో త్వరలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్యం అక్రమ నిల్వలు, విక్రయాల నియంత్రణపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఇందు కోసం వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ ద్వారా మద్యం సరఫరాను నియంత్రించే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను సీఈవో ఆదేశించారు.
రాష్ట్రంలోని మద్యం గోడౌన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ, నిల్వ చేసే కీలకమైన స్థలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా సంస్థలు, గోడౌన్లకు వచ్చి వెళ్లే వాహనాలు, మద్యం తరలించే వాహనాలకు జీపీఎస్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రక్రియను అంతా వెబ్ క్యాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు. ఈనెల 15లోగా ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా.