AP Capital city: అమరావతి అభివృద్ధి ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Update: 2024-11-10 12:06 GMT

AP Capital city: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలకమైన ముందడుగు పడింది. అమరావతి అభివృద్ధిలో భాగంగా ఏపీ సీఆర్డిఏ పంపించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇవే ప్రతిపాదనలను పరిశీలించిన వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ కూడా ఆమోదించాయి. దీంతో ఆ రెండు సంస్థలు రాజధాని మౌలిక వసతుల కల్పన కోసం చెరో 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు చేసేందుకు ముందుకొచ్చాయని ఏపీ సర్కారు తెలిపింది.

వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అందించనున్న రూ. 15వేల కోట్ల రుణం అమరావతి అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు ఏపీ సర్కారు స్పష్టంచేసింది. ఈ క్రమంలో అవసరమయ్యే మిగతా నిధులను కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోనున్నట్లు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Tags:    

Similar News