AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ..సూపర్ 6 స్కీమ్స్ అమలుపై చర్చ

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ నేడు సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇది.

Update: 2024-06-24 03:30 GMT

AP NEWS: నేడు ఏపీ కేబినెట్ భేటీ..సూపర్ 6 స్కీమ్స్ అమలుపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షత రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. పలు శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలియజేసేలా శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛను మొత్తం రూ. 4వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు 5 సంతకాలు చేశారు.

సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల అమలు, దానికి అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపైగా మంత్రివర్గంలో చర్చిస్తారని తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నట్లు తెలిసింది.

జులై నెలాఖరులోకా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎసైన్డ్ భూముల రెజిస్ట్రేషన్లపైనా వివరాలు తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Tags:    

Similar News