AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ
AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది.
AP Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో ప్రభుత్వం కొత్త పాలసీలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల హామీలపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ చర్చించనుంది. మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు చేసే ఛాన్స్ ఉంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై కేబినెట్ చర్చించనుంది. ఇవాళ కేబినెట్ ముందుకు పారిశ్రామిక రంగానికి చెందిన 5 నుంచి 6 నూతన పాలసీలను కేబినెట్ ముందు ఉంచనున్నారు.
ఈ కేబినెట్ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఇతర కూటమి మంత్రులు హాజరయ్యారు. కాగా రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.