Andhra Pradesh: సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
Andhra Pradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది.
Andhra Pradesh: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాల సమాచారం. సమావేశంలో ఎలక్ట్రానిక్ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలు, పాక్షికంగా కరోనా కర్ఫ్యూ ఏర్పాటుపైనా చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.
అలాగే రేపటి నుంచి ఏపీలో పాక్షిక కర్ఫ్యూ అమలు కానుంది. పాక్షిక కర్ఫ్యూ ఏర్పాటు, ఆస్పత్రుల్లో పడకల పెంపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర కీలకమైన అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. 18-45 ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సినేషన్ కోసం నిధుల కేటాయింపుపైనా చర్చించి ఆమోద ముద్ర వేయనుంది కేబినెట్.
విశాఖపట్నం కైలాసగిరి నుంచి భోగాపురం వరకు పర్యాటక ప్రాజెక్టులు, భూ సేకరణలో ఎస్సి, ఎస్టీలకు అదనపు పరిహారం, అర్చకులకు వేతనాల పెంపు, ప్రైవేట్ యూనివర్సిటీలలో 35శాతం కన్వీనర్ కోట కింద ఇచ్చే ప్రతిపాదనపై మంత్రి మండలి చర్చించనుంది. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి బిడ్ల ఖరారుపై ర్యాటిఫికేషన్ ఇవ్వడంతోపాటు, చెన్నై- బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో 5 వేల కోట్లతో అభివృద్ధి ప్రణాళికలపై ప్రతిపాదనలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.