Tammineni Sitaram Comments On Raghu Ramakrishnam Raju: ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ స్పీకర్ తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు..

Tammineni Sitaram Comments On Raghu Ramakrishnam Raju: వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-07-05 11:34 GMT

Tammineni Sitaram Comments On Raghu Ramakrishnam Raju: వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తున్నారనీ ఆయన అన్నారు. పార్టీ నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని సూచించారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, సొంత పార్టీపై అప్రకటిత యుద్ధాన్ని కొనసాగిస్తుండటం, అవన్నీ సైలెంట్‌గా గమనిస్తూ వైసీపీ అధిష్టానం రగిలిపోతుండటం, ఎలాంటి కాక రేపుతోందో చూస్తున్నాం. స్వపక్షంలో విపక్షంలా ఘాటైన విమర్శలతో రెచ్చగొడుతున్న రాజు వ్యవహారాన్ని, సీరియస్‌గా తీసుకుంది వైసీపీ హైకమాండ్‌. ఎలాగైనా ఆయనపై అనర్హత వేటు పడాలన్న పట్టుదలతో వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ల్యాండయ్యారు. వెంటనే స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి, రఘురామపై డిస్‌క్వాలిఫికేషన్‌ పిటిషన్ ఇచ్చారు. కొన్నిరోజుల నుంచి సొంత పార్టీపై ఆ‍యన చేస్తున్న వ్యాఖ్యల పేపర్ కటింగ్స్‌ను, మీడియాలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను సమర్పించారు.

సుమారు వంద పేజీల లేఖను స్పీకర్‌కు అందించారు. పార్టీ నియమావళిని ఉల్లంఘించిన రఘురామను ఎంపీగా అనర్హుడని ప్రకటించాలని కోరారు.ఢిల్లీకి వైసీపీ నేతలు బయల్దేరిన టైంలోనే, రఘురామ రాజు హైకోర్టును ఆశ్రయించడం, మొత్తం ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్. మొన్నటి వరకు తాను పార్టీని పల్లెత్తు మాటా అనలేదు, తాను ఏ రూలూ అతిక్రమించలేదన్న రాజు, ఆల్‌ ఆఫ్ సడెన్‌గా షోకాజ్ నోటీస్‌పై హైకోర్టులో పిటిషన్ వేశారు. షోకాజ్ నోటీసులోని లోపాలపై ఈసీ నుంచి స్పష్టత వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో కోరిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News