AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.46 గంటలకు ప్రారంభం అవుతాయి. తొలుత ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేయనున్నారు.
AP Assembly: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.46 గంటలకు ప్రారంభం అవుతాయి. తొలుత ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేసిన అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రిజిస్టర్లలో సంతకాలు చేశారు. ప్రొటెం స్పీకర్ గొరెంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీసీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు.
ఇక ఎమ్మెల్యేల ప్రమాణీ స్వీకారం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ విజిటింగ్ పాస్ లను జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు తెలిపారు. స్థలాభావం కారణంగా విజిటింగ్ పాస్ ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.