AP Assembly: రెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
AP Assembly: గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
AP Assembly: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. చివరగా సీఎం జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. గవర్నర్‌తో అన్ని అబద్ధాలే చెప్పించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా టీడీపీ ప్లాన్ చేసింది. టీడీపీ ప్రశ్నలకు కౌంటర్ ఇచ్చేలా ప్రభుత్వం సైతం సమాయత్తం అవుతోంది. దీంతో సమావేశాలు వాడీ వేడీగా జరిగే అవకాశం ఉంది.
ఇక అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజులు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 7న ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది... ఫిబ్రవరి 8న బడ్జెట్‌పై ఇరుసభల్లో ప్రజాప్రతినిధులు చర్చించనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సైతం హాట్ హాట్‌గానే జరగనుంది.