Antarvedi Sri Lakshmi Narasimha Swamy : అంతర్వేది ఆలయంలో అపచారం..అగ్నికి ఆహుతైన లక్ష్మీనరసింహస్వామి రథం

Antarvedi Sri Lakshmi Narasimha Swamy : తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయంలో ఘోర అపచారం జరిగింది.

Update: 2020-09-06 04:12 GMT

Antarvedi Sri Lakshmi Narasimha Swamy : తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయంలో ఘోర అపచారం జరిగింది. అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం అకస్మాత్తుగా అగ్నికి ఆహుతయ్యింది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆలయ ప్రాంగణంలోని షెడ్డులో భద్రపరిచిన 40 అడుగుల ఎత్తైన రథం మంటలు అంటుకొని దగ్ధం అయింది. 60 ఏళ్ల కిందట తయారు చేసిన ఈ రథం దగ్ధమవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ రథం ప్రమాదవశాత్తు దగ్ధమయిందా లేదా ఎవరైనా ఆకతాయిలు కావాలని ఇలా చేసారా అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రతి ఏటా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని మాఘ మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. ఎంతో ఘనంగా నిర్వహించే ఈ కల్యాణోత్సవాల్లో భాగంగా ఈ రథంపైనే స్వామివారిని ఊరేగించడం అనవాయితీగా వస్తుంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు.

కృత యుగములో ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.

అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమము ఉంది. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన ఆశ్రమము నిర్మించబడింది. ఈ ఆశ్రమము వికసించిన కమలము మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరము మధ్య కలువపూవు ఆకారమున ఈ ఆశ్రమము అత్యంత అద్భుతమైన కట్టడము. దీనికి సమీపముగా ద్యానమందిరం, పఠనాశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి ఉన్నాయి. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడములు ఉన్నాయి.

వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, బీచ్ వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ధి పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుభ్రంగానూ, స్వచ్ఛంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, దీపస్తంభం (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.

Tags:    

Similar News