Alipiri: అలిపిరి వద్ద మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం.. రెండు టీవీలతో తిరుమలకు చేరుకున్న ఇద్దరు యూపీ వ్యక్తులు
Alipiri: ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Alipiri: అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మరోసారి భధ్రతా సిబ్బంది వైఫల్యం బయట పడింది. తిరుమల డౌన్ ఘాట్ రోడ్డు నుండి రెండు టీవీలతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తిరుమలకు చేరుకున్నారు. GNC టోల్ గేట్ వద్ద తనిఖీల్లో వాహనాన్ని ఆపగా.. వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరూ సెకండ్ హ్యాండ్ టీవీలను విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు. తమను అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర ఆపలేదని.. ఎలాంటి తనిఖీలు చేయలేదని తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు లాడ్జ్ లో ఉంటున్నట్లు తెలపగా.. గదిని పోలిసులు తనిఖీ చేస్తున్నారు.