Tirumala: తిరుమలలో మరో చిరుత కలకలం..
Tirumala: లక్ష్మీనరసింహస్వామి ఆలయం నామాలగవి వద్ద కనిపించిన చిరుత
Tirumala: తిరుమలలో చిరుతల సంచారం తీవ్ర కలకం రేపుతున్నాయి. ఇవాళ ఉదయమే ఒక చిరుతను బంధించగా.. ఇప్పుడు.. అదే ప్రాంతంలో మరో చిరుత కనిపించడం.. తీవ్ర కలకలం రేపుతోంది. అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుత సంచరిస్తున్నట్టు భక్తులు చెబుతున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం నామాలగవి వద్ద చిరుత కనిపించిందని అంటున్నారు. ఒక్కసారిగి చిరుత కనిపించడంతో అరుపులు, కేకలు వేసుకుంటూ భక్తులు పరుగులు తీసినట్టు సమాచారం.