తిరుమల కాలిబాటలో బోనులో చిక్కిన మరో చిరుత
Tirumala: ఐదో చిరుతను ట్రాప్ చేసిన అటవీశాఖ అధికారులు
Tirumala: తిరుమల కాలిబాటలో బోనులో మరో చిరుత చిక్కింది. దీంతో అటవీశాఖ అధికారులు ఐదో చిరుతను ట్రాప్ చేసినట్లయింది. 7వ మైలు మధ్యలో చిరుతను ట్రాప్ చేసిన అధికారులు చిరుత సంచారాన్ని కెమరా ద్వారా గుర్తించిన అధికారులు, బోను ఏర్పాటు చేశారు. అలవాటు ప్రకారం సంచారానికి వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. పట్టుబడిన చిరుతలను శ్రీవెంకటేశ్వర జంతుప్రదర్శనశాల అధికారులకు అప్పగించాలని ఉన్నతాధికారులతో చర్చించారు.