ఏపీలో ఈ నెల 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం అయ్యాయి. దాంతో మరికొందరికి క్లాస్‌లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో పాఠశాలల్లో వైరస్ వ్యాపించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే 9,10 తరగతుల స్కూల్స్ ప్రారంభం కాగా.. ఈ నెల 23 నుంచి 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు క్లాస్‌లు ప్రారంభించనున్నారు.
ఏపీలో కోవిడ్ కారణంగా మూతపడిన విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగా మొదటి విడతగా నవంబర్ 2 నుంచి 9,10, ఇంటర్ క్లాసులు ప్రారంభం అయ్యాయి. వైరస్ బారిన పడకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 23 నుంచి 6,7,8 క్లాసులను ప్రారంభించాలని నిర్ణయించింది.
డిసెంబర్ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకి ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే ప్రారంభించిన 9,10 తరగతులకు విద్యార్థులు తక్కువ శాతం హాజరవుతున్నారు.
పిల్లలను స్కూల్ పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు స్కూల్స్ కు వెళ్లిన విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో పేరెంట్స్ భయపడుతున్నారు. అయితే ప్రభుత్వ విధానాలపై పేరెంట్స్ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చిన తరువాత క్లాసులు ప్రారంభిస్తే బాగుండదనే వాదన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వినిపిస్తోంది.