Visakhapatnam: విశాఖ సిగలో మరో మణిహారం, రూ.96 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం

Visakhapatnam: అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి సోనోవాల్‌

Update: 2023-09-04 06:29 GMT

Visakhapatnam: విశాఖ సిగలో మరో మణిహారం, రూ.96 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం

Visakhapatnam: విశాఖ పర్యాటక కీర్తి కిరీటంలో మరో మణిహారం చెరబోతుంది. నేడు అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ను కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌ ప్రారంభించనున్నారు. దేశ విదేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్‌ చానల్‌ బెర్త్‌లో 96 కోట్ల రూపాయాలు తో ఈ సముద్ర విహార కేంద్రాన్ని నిర్మించారు. ఇందుకోసం కేంద్ర టూరిజం శాఖ 38. కోట్ల 50 లక్షల రూపాయలు కేటాయించింది. క్రూయిజ్‌ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా క్రూయిజ్‌ టెర్మినల్‌‌ను తీర్చిదిద్దారు. భారత్‌లో క్రూయిజ్‌ టూరిజానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ టెర్మినల్‌ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది.

Tags:    

Similar News