ఏపీలో ఆగని ఆలయాలపై దాడులు
* విజయవాడలో వెలుగుచూసిన మరో ఘటన * సీతారామ ఆలయంలో పగిలిఉన్న సీతమ్మ మట్టి విగ్రహం * పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఘటన
ఏపీలో వరుసగా విగ్రహాల ధ్వంసం అవుతున్నాయి. విజయనగరం రామతీర్ధంలో వివాదం రగులుతున్నా సమయంలోనే విజయవాడలోనూ మరో విగ్రహాన్ని ధ్వంసం అయింది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఉన్న సీతారామ మందిరంలో సీతమ్మ మట్టి విగ్రహం ధ్వంసం అయింది. అయితే.. ఆలయానికి వేసిన తాళం అలానే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెస్ మధ్య నుంచి ఆకతాయిలు విగ్రహాన్ని పగల కొట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన స్థలానికి టీడీపీ, బీజేపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఘటన స్థలానికి మాజీమంత్రి దేవినేని ఉమా చేరుకున్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.