Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత
Tirumala: వేర్వేరు సందర్భాల్లో మూడు చిరుతలను బంధించిన అటవీశాఖ అధికారులు
Tirumala: తిరుమలకు వెళ్లే నడకమార్గంలో మరో చిరుతపులి బోనులో చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పట్టుబడింది. ఇటీవల చిరుత పులుల సంచారం కాలికనడక భక్తుల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అటవీశాఖ విభాగాధికారులు, వన్యప్రాణి విభాగాధికారులు సమన్వయంతో మోకాలి మెట్టు, శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులు ఏర్పాటు బోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా వేర్వేరు సందర్భాల్లో మూడు చిరుత పులులను బంధించిన అటవీశాఖ అధికారులు. పట్టుబడిన చిరుతను తిరుపతి ఎస్వీజూపార్టుకు తరలిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.