విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ రెండు పథకాలకు మరో ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న వసతి దీవెన,

Update: 2020-06-24 12:35 GMT

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలకు అర్హులై ఉండి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల లబ్ది పొందలేని వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది.

వివిధ కారణాలతో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన పథకాలు పొందని వారు వెంటనే గ్రామ , వార్డు వాలంటీర్ల ద్వారా పేర్లు నమోదు చేసి వివరాలు నమోదు చేయించుకోవాలని, ప్రభుత్వం దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఎంపిక చేస్తామని తెలిపింది.

అయితే జగనన్న వసతి దీవెన కింద విద్యార్ధులకు ప్రతీ ఏటా రూ.20వేలను ప్రభుత్వం అందిస్తోంది. వసతి, భోజనం ఖర్చుల నిమిత్తం డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రెండు విడతలుగా ఈ డబ్బును వారి తల్లుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తున్నారు.

ఇక జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థులకు సంబంధించిన పూర్తి కాలేజీ ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News