TTD: రోజుకు రెండు పూటలా లక్షా 30 వేల మందికి అన్నప్రసాదాలు- వైవీ సుబ్బారెడ్డి
YV Subba Reddy: తిరుచానూరు పద్మావతి ఆలయంలో రాత్రివేళ అన్నప్రసాద వితరణ
YV Subba Reddy: తిరుమలలోని స్థానిక దేవాలయాల్లో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే తిరుచానూరు పద్మావతి ఆలయంలో అన్నప్రసాద వితరణను ప్రారంభించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 2007 నుంచి పద్మావతి ఆలయంలో అన్నప్రసాద వితరణ ప్రారంభం అవగా.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అన్నప్రసాదాలు అందించారు. ఇప్పుడు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు అందించేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు రోజుకు రెండు పూటలా కలిపి దాదాపు లక్షా 30 వేల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.