నా ఫ్లెక్సీలు పెట్టొద్దు.. నెల్లూరు సిటీలో ఫ్లెక్సీలపై వివాదంపై అనిల్ ఆవేదన...

Anil Kumar Yadav: కొందరు కావాలనే వివాదం చేస్తున్నారన్న మాజీ మంత్రి...

Update: 2022-04-26 07:46 GMT

నా ఫ్లెక్సీలు పెట్టొద్దు.. నెల్లూరు సిటీలో ఫ్లెక్సీలపై వివాదంపై అనిల్ ఆవేదన...

Anil Kumar Yadav: ఆయన మాట్లాడితే కాంట్రవర్సీ... మాట్లాడకున్నా కాంట్రవర్సీనే... నెల్లూరు రాజకీయాలే కాదు.. రాష్ట్ర రాజకీయాల్లోనూ సంచలనంగా నిలిచిన మాజీ మంత్రి అనిల్(Anil Kumar Yadav) తాజాగా చేసిన వ్యాఖ్యలు.. కలకలం రేపుతున్నాయ్. ఇటీవల మంత్రి కాకాణితో విభేదాలతో మంత్రి రూట్ మార్చినట్టుగా కన్పిస్తోంది. మొన్నటి వరకు దూకుడుతో రెచ్చిపోయే అనిల్ ఒక్కసారిగా లైన్ చేంజ్ చేశారు.

నెల్లూరు(Nellore)లో ఫ్లెక్సీల చించివేత, తొలగింపు వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అనిల్. ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగా తొలగించడం కానీ... చించివేయడం కానీ చేయలేదన్నారు. గత రెండున్నరేళ్లుగా నగరంలో ఫ్లెక్సీలను వేయొద్దన్న నిర్ణయంతో... చివరకు తన ఫ్లెక్సీలను కూడా వేయలేదన్నారు అనిల్. ఫ్లెక్సీల తొలగింపు వివాదం దురదృష్టకరమన్నారు.

ఫ్లెక్సీల వివాదం గురించి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మంచి పని చేయాలని తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు వివాదమవుతోందన్నారు. ఇకపై ఎవరైనా నచ్చినచోటల్లా ఫ్లెక్సీలు వేసుకోండంటూ అసహనం వ్యక్తం చేశారు అనిల్. తన ఫ్లెక్సీలు మాత్రం ఎవరూ పెట్టొద్దని కార్యకర్తలకు స్పష్టం చేశారు. నగరంలో ఫ్లెక్సీలతో ఎన్నో సమస్యలు వస్తున్నాయని... కార్యకర్తలకు అదనపు ఆర్థిక భారంతో పాటు... జేబులకు చిల్లులు పడే పరిస్థితి ఉందన్నారు.

కార్యకర్తలతోపాటు... ప్రతిపక్ష జనసేనకు ఆర్థికంగా ఇబ్బందన్నారు. మెత్తగా, సునితంగా, మౌనంగా ఉంటానే తప్పించి ఎవరికీ హానీ చేయనన్నారు అనిల్. ఫ్లెక్సీల విషయంపై తనకు ముఖ్యమంత్రి హెచ్చరికలు చేశారన్న మాటలు సరైనవి కాదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు శిరోధార్యమన్నారు అనిల్.

Tags:    

Similar News