Anil Kumar: నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్‌కుమార్‌రెడ్డికి.. కొందరు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు
Anil Kumar: నెల్లూరు జిల్లా సైదాపురం మైనింగ్‌పై ఎమ్మెల్యే అనిల్ సంచలన వ్యాఖ్యలు
Anil Kumar: నెల్లూరు జిల్లా సైదాపురం అక్రమ మైనింగ్‌పై ఎమ్మెల్యే అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనింగ్ వ్యవహారాన్ని వైసీపీపై వేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సైదాపురం మైనింగ్‌లో 80 శాతం టీడీపీకి చెందిన వారే ఉన్నారని ఆయన ఆరోపించారు. లీజులు అయిపోయిన మైనింగ్‌లు కొనసాగిస్తూ ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని అధికార పార్టీ వైసీపీకి ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నారని అనిల్ పేర్కొన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్‌కుమార్‌రెడ్డికి కొందరు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనిల్ అన్నారు.